గుంటూరు, : గుం టూరు జిల్లాలో మిర్చి రైతులను ఏమార్చి, వారిని దోపిడీ చేస్తున్న నకిలీ వ్యాపారులు భారీ స్కాంకు పాల్పడినట్టు- అనుమానిస్తున్నారు. దీంతో పోలీసు యంత్రాంగంతోపాటు- స్వతహాగా పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం వేర్వేరుగా దర్యాప్తు చేపట్టారు. వారి దర్యాప్తులో నిందితు లకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు లభ్యమై నట్టు- సమాచారం. రైతులను ఏమార్చి, దోపిడీ చేసిన సొమ్ముతో కొంతమంది బెంగళూరులో రియల్ ఎస్టేట్‌లో పెట్టు-బడులు పెట్టినట్టు- అను మానిస్తున్నారు. ఇందుకు సంబంధించి సత్తెనపల్లి పోలీసులు కూలంకశంగా దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తునకు ప్రత్యేక బృందం
రైతులను ఏమార్చి శీతల గిడ్డంగులలోని సిబ్బంది సహాయంతో కోట్ల రూపాయలు కొల్ల గొడుతున్న వైనం జిల్లాలో కలకలం రేకెత్తిస్తోంది. రైతులకు ఎగవేసిన సొమ్ము భారీగా వుండటం, అందుకు సంబంధించి వేర్వేరు పోలీసు స్టేషన్ లలో కేసులు నమోదు కావటంతో దర్యాప్తు సజా వుగా సాగేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని నియ మించాలని యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం పోలీసు అధికారులకు సూచించారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోనూ దర్యాప్తు జరపాల్సి వున్నందున డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పా టు- చేయాలని యోచిస్తున్నారు.
కోల్డ్ స్టోరేజ్ సంస్థల సిబ్బంది పాత్ర?
రైతులను ఏమార్చి, భారీ దోపిడీకి పాల్ప డిన సంఘటనలో కోల్డ్ స్టోరేజ్ సంస్థల సిబ్బంది పాత్ర వున్నట్టు- పక్కాగా ఆధారం లభిం చినట్టు- చెబుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మిర్చిని వారికి సంబంధించిన వాహనాలలోనే గుంటూరులోని ఒక కోల్డ్ స్టోరేజ్‌కి తీసుకు వచ్చి అన్‌లోడ్ చేయటంతో ఎవరికీ అనుమానం కలగ లేదు. రైతులకు సైతం వ్యాపారులపై ఒక నమ్మకం ఏర్పడింది. అయితే అన్‌లోడ్ చేసిన కొద్ది గంట లకే ఆ మిర్చి లోడ్‌లు వేరొక వాహనంలో బయ టకు తరలివెళ్ళి పోవటం ఆ కోల్డ్ స్టోరేజ్‌లో ఏర్పా టు- చేసిన సీసీ టీ-వీ ఫుటేజ్‌లో రికార్డు అయి నట్టు- చెబుతున్నారు. ఈ సందర్భంగా కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు కనీస నిబంధనలు పాటించకపోవ టం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధార ణంగా కోల్డ్ స్టోరేజ్‌లోకి సరకు వచ్చినప్పుడు వ్యాపారులు తీసుకువస్తే వారికి సంబంధించిన లైసెన్స్ వివరాలు నమోదు చేయాల్సి వుంటు-ంది. రైతులు తీసుకు వచ్చిన పక్షంలో వారికి సంబం ధించిన పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీతో పాటు- పూర్తి చిరునామా రికార్డు చేయాలి. అయితే మిర్చి తీసుకువచ్చిన వాహనం నంబరు వేసుకొని ఒకరి పేరు నమోదు చేసుకొని అన్‌లోడ్ చేసుకు న్నారు.ఆ కోల్డ్ స్టోరేజ్ సిబ్బంది నమోదు చేసు కున్న పేరు వ్యాపారా? రైతా? అన్న వివరాలు ఏమీ లేవు. అదే విధంగా బయటకు తీసు కెళ్లే సమయంలో వాహనం నం బరు, వ్యక్తి పేరు వేరు గా నమోదు చేసుకు న్నారు. ఇప్పుడు లోపల అన్ లోడ్ చేసిన సరకు, బయటకు తీసుకెళ్ళి న సరకు ఒక్క టేనా? వేర్వే రు వ్యక్తు లకు సం బంధించిన వా? అన్న ప్రశ్న లకు కోల్డ్ స్టోరేజ్ సిబ్బంది వద్ద సమాధానం లేదు. మిర్చి యార్డు చైర్మన్ చేపట్టిన అం తర్గత దర్యాప్తులో కోల్డ్ స్టోరేజ్‌లలో స్టాక్‌కు సంబంధించి వేర్వేరు గా రి కార్డులు నిర్వహిస్తున్నట్టు- వెల్లడయింది.
కదులుతున్న డొంక
రైతులను ఏమార్చి కోట్లు- కొల్లగొట్టిన ఉదంతంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. చాలా కోల్డ్ స్టోరేజ్‌లలో రికార్డుల నిర్వహణ పక్కగా లేకుండా జీరో బిజినెస్‌కు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వస్తున్నది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉదంతం జరుగుతున్నట్టు- యార్డు పాలకవర్గం అనుమా నిస్తోంది. ఈ విధంగా జీరో బిజినెస్ జరగటం వల్ల యార్డు ఆదా యా నికి భారీగా గండి పడుతున్నది.
దీంతో జిల్లాలో మిర్చి నిల్వలు వున్న అన్ని కోల్డ్ స్టోరేజ్‌లపై సమగ్ర దర్యాప్తునకు పాలక వర్గం సమాయత్తం అవుతోంది. ఈ ఉదంతం వెలుగులోకి రాగానే గతంలో ఇదేవిధంగా మోసానికి గురయిన పలువురు రైతులు ముందుకు వస్తున్నారు. ఇదే తరహాలో రెండు సంవత్సరాల క్రితం తాడికొండ పోలీసు స్టేషన్లో కేసులు నమోదైన విషయం వెలుగు చూసింది. అప్పటి కేసులోనూ, తాజా సంఘటనలోనూ నిందితులు ఒకరే కావటం విశేషం.
రెండు సం వత్సరాల క్రితం పోలీసు కేసు నమోదు అయినప్పటికీ నిందితులు జంకూబొంకు లేకుండా అదే తరహా నేరానికి పాల్పడటం గమనార్హం. దీంతో నిందితులకు కొంతమంది పలుకుబడిగల పెద్దల అండదండలు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుత సంఘటనలో మోసపోయిన రైతులు సత్తెనపల్లి, ఫిరంగిపురం, యడ్లపాడు, మెెడికొండూరు మం డలాలకు చెందినవారు. వారంతా తమకు న్యాయం చేయమని పోలీసు స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారు.
మిర్చి రైతులను దోచి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు..
Advertisement
తాజా వార్తలు
Advertisement