Monday, November 18, 2024

ఎరువుల ధ‌ర‌ల‌కు రెక్క‌లు …ఏకంగా 20 నుంచి 30 శాతం పెంపు..

అమరావతి, : ఎరువుల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు 20 నుంచి 30 శాతం మేర ధరలు పెంచగా మిగిలిన కంపెనీలు వచ్చే ఆర్ధిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌ 1 నుంచి పెంచేందుకు నిర్ణయించాయి. రైతులకు సబ్సిడీ ధరలకు ఎరువులను పంపిణీ చేసే ప్రక్రియ కూడా సంప్రదాయంగా కొనసాగుతూ ఉంటు-ంది. నియంత్రలు ఎన్ని ఉన్నా మార్కెట్‌ లో అమాంతం పెరుగుతున్న ధరలను కట్టడి చేసే చర్యలేవీ అమలు కావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌ లో కొనుగోలు చేసే 50 కిలోల సాధారణ ఎరువుల బస్తాపై 200 నుంచి 250 రూపా యల దాకా పెరగటంతో ఏమీ చేయాలో రైతులకు దిక్కు తోచటం లేదు. మార్కెట్‌ లో ఎక్కువగా అమ్ముడయ్యే 20:20:20 రకం ఎరువుల బస్తా కనిష్ట ధర 975 కూ, గరిష్ట ధర 1125కు చేరింది. అంతకు ముందు గరిష్ట ధర రూ 890 గా ఉంది. డిఏపీ ధరలు రూ 1200 నుంచి 1275 వరకు ఉండగా ఇపుడవి రూ 1450కు చేరాయి. 10:25 రకం ఎరువుల బస్తా కూడా రూ 150 మేర పెరిగింది. కొన్ని కంపెనీలకు సంబంధించిన ఎరువులు పెంచిన ధరలకు మాత్రమే మార్కెట్‌ లో అందుబాటు-లో ఉండగా మరికొన్ని కంపెనీల ఎరువులు వచ్చే నెల 1 నుంచి పెరగనున్నాయి. మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం డీఏపీ 50 కిలోల బస్తాపై కనిష్టంగా రూ.250, కాంప్లెక్స్‌ బస్తాపై కనిష్టంగా రూ.150 మేర ధరలు పెరగనున్నాయి. రాష్ట్రంలో రబీ ముగింపు దశకు రాగా 2021 ఖరీప్‌ సీజన్‌ కు గాను 20.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. దీనిలో కాంప్లెక్స్‌ ఎరువులు 7 లక్షల టన్నులు ఉండగా 8.25 లక్షల టన్నుల యూరియా ఉంది. సబ్సిడీ ధరలకు ప్రభుత్వం ఎరువులను పంపిణీ చేసినా సాగు అవసరాలు 40 శాతం కూడా తీరవు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌ లో ధరల ప్రభావం సాగు పెట్టు-బడి మీద పడుతోంది. డీజిల్‌ ధరలు భారీగా పెరగటంతో ఆ ప్రభావం రవాణా చార్జీలపై పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement