రాజుపాలెం, ప్రభన్యూస్ : మండలంలో బుధవారం వాతావరణంలో ఏర్పడిన మార్పుల సందర్భంగా ఒక్కసారిగా మేఘావృతమై చిరుజల్లులు కురవడంతో మిర్చి రైతులు పంటను రక్షించుకునేందుకు ఉరుకులు పరుగులు తీశారు. ఇప్పటికే తెగుళ్లతో మిర్చి పంటలు కోల్పోయిన రైతులకు మరో శాపంలా అకాల వర్షంమేంటని కన్నిరు మున్నీరయ్యారు.
పంటలు రక్షించుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు టార్పాలిన్ పట్టను కప్పి పంటల రక్షించేందుకు వివిధ ప్రయత్నాలు చేశారు. ప్రకృతి వైఫల్యంమో నకిలీ విత్తన ప్రభావమో తెలియదు కాని మిర్చి పంట తెగుళ్లతో సర్వసం కోల్పోయిన రైతులు అరకొర మిగిలిన పంట వరుణుదేవుని ఆక్రోషంతో పూర్తిగా పంట పాడైపోయి నష్ట పోతున్నామని రైతులు వాపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital