Monday, November 25, 2024

రైతులకు డ్రోన్ల పంపిణీకి ఏర్పాట్లు

తెనాలి, ఫిబ్రవరి 17 ప్రభ న్యూస్: మండల పరిధిలోని రైతులకు డ్రోన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ సాగర్ చెప్పారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆదేశాలతో జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు మన మండలానికి 3 డ్రోన్ గ్రూపులు ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. ఒక్కో గ్రూపులో నలుగురు సభ్యులు ఉంటారని, సభ్యులు రైతులుగా గుర్తించబడి ఉండాలని, నలుగురిలో ఒకరు ఇంటర్ విద్య ఆపై చదివిన వారై ఉండాలని చెప్పారు. ఆసక్తిగల గ్రూప్ సభ్యులు ఆయా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్ర సిబ్బందిని, మండల వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చని వెల్లడించారు. రైతులు అధిక ఎరువులు వాడడం వలన భవిష్యత్తు కాలంలో భూమి నిస్సారమవుతుందని కావున ఎరువులను అధికారుల సూచనల మేరకు తగిన మోతాదులో వాడుకోవాలని స్పష్టం చేశారు. రైతులు, కవులు రైతులు వారి ఈ కేవైసీ పూర్తి చేయించుకుని, ఈ క్రప్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఈకేవైసీ, క్రాఫ్ట్ నమోదుకు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉందని చెప్పారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement