Sunday, September 8, 2024

26న‌ గుంటూరు కీనల్ క్లబ్ డాగ్ షో…

గుంటూరు రూరల్ ఫిబ్రవరి 23 (ప్రభా న్యూస్) గుంటూరు కీనల్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీన ఆదివారం గుంటూరు నగరంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఉదయం 9 గంటలకు డాగ్ షో నిర్వ‌హించ‌నున్నారు. వివిధ జాతుల పూర్ బ్రీడ్ డాగ్ ప్రదర్శన నిర్వహించ‌నున్న‌ట్లు గుంటూరు కినల్ క్లబ్ అధ్యక్షులు రామచంద్రరాజు తెలియపరిచారు. మెట్రోపాలిటన్ సిటీస్ లాంటి నగరాల్లో మాత్రమే డాగ్ షో నిర్వహించబడనని, ఈ డాగ్ షోలో మనం ఎప్పుడూ చూడని, వివిధ రకాల జాతుల డాగ్స్ ను చూడవచ్చని తెలియజేశారు. గుంటూరు కినల్ క్లబ్ కార్యదర్శి ఎస్ వి వి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పెంపుడు జంతువుల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చునని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని, విశ్వాస జీవీ అయిన కుక్కలతో మనుషులకు ఆత్మీయ అనుబంధం ఏర్పడిందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని నగరవాసులందరూ , తమ పెంపుడు కుక్కలతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement