గుంటూరు – సంగం డైరీ నిర్వహణలో పలు అవతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై అరెస్ట్ అయిన టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.. కాగా, ఈ కేసులో అరెస్ట్ చేసిన నరేంద్రను విజయవాడ ఏసీబీ కార్యాలయంలో 5గంటలకుపైగా విచారించారు. విచారణ ముగిసిన తర్వాత నరేంద్రను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అలాగే ధూళిపాళ్ల నరేంద్రతో పాటు సంగం ఎండీ గోపాలకృష్ణను కోర్టు ముందు హాజరుపరిచారు. ఎసిబి కోర్టు వారికి రిమాండ్ విధించింది.. ఆ వెంటనే నరేంద్ర, గోపాలకృష్ణలను మచిలీపట్నం జైలుకు తరలించారు.. మూడో నిందితుడు గుర్నాథంకు కరోనా పాజిటివ్ తేలడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.. మచిలీపట్నం జైలులో ఉన్న నరేంద్రను నేటి ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు..
రాజమండ్రి సెంట్రల్ జైలుకి దూళిపాళ్ల నరేంద్ర….
By sree nivas
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Nesw
- ap news today
- arrest
- dhulipalla narendra
- Guntur City News
- Guntur Local News
- guntur news
- Guntur News Telugu
- Guntur News Today
- Guntur Telugu News
- Rajahmundry Central Prison
- tdp
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement