తాడేపల్లి,ఫిబ్రవరి19(ప్రభ న్యూస్) – తాడేపల్లి తహసిల్దారుగా మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు పని చేసి డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న వాకా శ్రీనివాసులరెడ్డి ని ఆదివారం ప్రాతూరు రోడ్డు లోని శ్రీ ఫార్చ్యూన్ గ్రాండ్ లో రెవిన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది డీలర్ల సంఘం ఆత్మీయులు మిత్రులు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.ముందుగా డిప్యూటీ తహసిల్దార్ సతీష్ సన్మాన గ్రహీత వాకా శ్రీనివాస్ ల రెడ్డిని సతి సమేతంగా వేదిక మీదకి ఆహ్వానించారు. అనంతరం వివిధ రెవెన్యూ అధికారులను వేదిక మీదికి ఆహ్వానించారు. ఈ సభకు తాడేపల్లి మండల ఇంచార్జ్ తహసిల్దార్ రాంప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తాడేపల్లి తాసిల్దార్ గా వాకా శ్రీనివాసుల రెడ్డి తాడేపల్లి ప్రజలకు తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారని అన్నారు.కోవిడ్ కాలంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియడారు.
చెరగని చిరునవ్వుతో ప్రణాళిక బద్ధంగా సిబ్బందికి ఎప్పటి పనులు అప్పుడు సకాలంలో పూర్తి చేసేందుకు తగిన సూచనలు ఇస్తూ పనులను పర్యవేక్షించి అన్ని విధాల సహకరించే వారిని తెలిపారు. ఉద్యోగంలోనే కాకుండా తమకు వ్యక్తిగతంగా వచ్చిన అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే పరిష్కరించుకొని తమ కుటుంబ సభ్యుడిగా ఆయన నిలిచారన్నారు.
ఈ సందర్భంగా సన్మాన గ్రహీత వాకా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తాను తాడేపల్లిలో దీర్ఘకాలం పనిచేశానని ఇక్కడ ఉన్న వాతావరణం ఇక్కడున్న ప్రజలు తమకు బాగా నచ్చారని ఉద్యోగ విరమణ అనంతరం కూడా తాడేపల్లి లోనే నివాసం ఏర్పరచుకొని ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. అలాగే తను పనిచేసిన కాలంలో తనకు సహకరించిన సిబ్బందికి అధికారులకు ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
అలాగే తను ఇంత పేరు తెచ్చుకోవడానికి ప్రజల మన్ననలు పొందడానికి కారణం తన సతీమణి లక్ష్మి ప్రసన్న అని ఆమె సహకారంతోనే పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకున్నారన్నారు తనకు అన్ని విధాలా సహకరించిన తన సతీమణికి కృతజ్ఞతలు తెలియజేసి ఇంత మంచి భార్యను ప్రసాదించిన భగవంతుడికి రుణపడి ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రమేష్ నాయుడు, ఇతర అధికారులు ఆర్.నారాయణరెడ్డి, రామ్మోహన్ రావు, తహసిల్దార్ సుభాని, ఆర్ ఐ ప్రశాంతి, సర్వేర్ల సంఘం రాష్ట్ర సెక్రటరీ లక్ష్మీనారాయణ, నూతనంగా తాడేపల్లి తాసిల్దారుగా బాధ్యతలు తీసుకోబోతున్న నాగిరెడ్డి, ప్రముఖులు బుర్ర ముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి, మున్నంగి వివేకానంద రెడ్డి, ఈదులముడి డేవిడ్ రాజు,బ్రహ్మ రెడ్డి,కాట్రగడ్డ శివన్నారాయణ,గుండిమెడ విఆర్వోమల్లికార్జునరెడ్డి, పంచాయతీ కార్యదర్శలు ప్రసాద్, అమరేష్ సుబ్బారెడ్డి,రాధకుమారి , తదితరులు పాల్గొన్నారు.