Friday, November 22, 2024

మృత్యు అంచునే అంగ‌రక్ష‌కుల జీవితాలు……

తెనాలి : కొన్ని ఉద్యోగాలు కత్తిమీద సాము వంటివి. వాటిలో మరీ ముఖ్యంగా పోలీసు ఉద్యోగం. క్రింది స్థాయి ఉద్యోగుల ఈతిబాధలు అంతా ఇంతా కావు. కొంతమంది ఉన్నతాధికారులు వీరిని ఆర్డర్లీలుగా వారి ఇళ్లలో స్వంత పనులకు కూడా వాడుకోవడం చూస్తుంటాము. ఉద్యోగభద్రతను దృష్టిలో ఉంచుకొని ఎదురు చెప్పలేని పరిస్థితి వీరిది.అయితే ప్రజా ప్రతినిధులకు అంగరక్షకులుగా వెళ్ళినపుడు చాలా జాగ్రత్తగా విధి నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధులను కలువటానికి వచ్చే ప్రజలను నిరంతరం గమనిస్తూ, వారి పర్యటన లో వెన్నంటి ఉంటూ తమకు కేటాయించిన విఐపీ ను ఇంటికి చేర్చేవరకూ వీరికి విషమ పరిస్థితే అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ క్రమంలో శుక్రవారం తన విఐపి వాహనంలో చోటు లేకపోవడంతో వాహనాన్ని పట్టుకు వెళ్లాడుతూ ఒక పిఎస్ఓ విధులు నిర్వహిస్తున్న ఈ దృశ్యం తెనాలిలో కనిపించింది.ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement