Friday, November 22, 2024

ఎపిలో క‌రోనా సెకండ్ వేవ్ బ్లాస్ట్….24 గంట‌ల్లో 9వేల పాజిటివ్స్, 35 డెత్స్…

అమ‌రావ‌తి – ఎపిలో క‌రోనా సెకండ్ వేవ్ విరుచుకుప‌డింది.. కేవ‌లం 24 గంట‌ల‌లో 8,987 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కాగా, ఏకంగా 35 మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు.. ఎపిలో ఇంత పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి.. త్తూరుతో పాటు నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మరణాల్లోనూ మరింత పెరుగుదల నమోదైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఎనిమిది మంది మరణించగా, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఐదుగురు కరోనాతో కన్నుమూశారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,116 మంది కొవిడ్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,76,987 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,15,626 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 53,889 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్ ప్రభావంతో ఇప్ప‌టి వ‌ర‌కు మరణించిన వారి సంఖ్య 7,472కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement