అమరావతి, : రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకాన్ని వణికిస్తున్న కరోనా వచ్చిందంటే ఆసుపత్రులకు పరుగులు తీయాలి.. బెడ్ దొరుకుతుందో లేదో భయం.. దొరికినా కొలుకుంటామో లేదోనన్న అనుమానం బాధితులను వెంటాడుతోంది. కోవిడ్ బారినపడ్డ ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇదే ఆందోళనలో ఉన్నారు. కానీ 80శాతం మందికి పైగా ఇంట్లోనే ఉండి కరోనాను నయం చేసుకుంటు-న్నారన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం కరోనా కిట్లు- ఇస్తూ వారికి వైద్యంతో ధైర్యం కూడా అందిస్తూ… కరోనాను దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా కిట్ల పంపిణీ చేపడుతోంది. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని మొత్తం వణికిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో వైరస్ దూకుడు మామూలుగా లేదు. కేసుల సంఖ్య వందలు, వేలు దాటి లక్షలకు చేరుకుంటోంది. యాక్టీవ్ కేసులు వేల సంఖ్యలో చేరుకుంటు-ండటంతో బెడ్ల సమస్య తీవ్రంగా ఉంది.. అలాగే, ఆరోగ్యం విషమించి ఉపిరాడక ఆక్సిజన్ సమస్య తలెత్తుతోంది. ఇదిలావుంటే, అసలు కరోనా వచ్చిన వారిలో వందకు 80మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అసలు కొందరికి చికిత్స లేకుండానే నయం అవుతోంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించకుండా ఆసుపత్రుల వెంట పరుగులు తీస్తూ ఆందోళన చెందుతున్నారు.
ప్రణాళిక బద్ధంగా కిట్ల పంపిణీ…
కరోనా సోకినవారిని ఏపీ ప్రభుత్వం హోం క్వారం-టైన్‌లో ఉండేలా ప్రోత్సహిస్తోంది. దీనికి ఒక పక్కా పధకం ప్రకారం ముందుకెళ్తోంది. ప్రధానంగా పరీక్ష చేయించుకున్న తర్వాత పాజిటీ-వ్ రాగానే వారికి ఫోన్ వెళ్తుంది. మీకు ఏమైనా కోవిడ్ కు సంబంధించిన లక్షణాలు ఉన్నాయా.. ఆరోగ్యం ఎలా ఉందన్నది.. ఎలాంటి లక్షణాలు లేకపోయినా, లేక మైల్డ్ సింటమ్స్ ఉన్నా.. ఇంట్లోనే ఉండాలని సూచిస్తోంది. మీరు ఎలాంటి చికిత్సలు పొందాలన్నది గైడ్ చేస్తున్నారు. ఇందుకోసం 104 నెంబర్ తో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు- చేశారు. కొద్ది పాటి సింటమ్స్ ఎక్కువగా ఉంటే.. క్వారం-టైన్ సెంటర్స్ కు తరలిస్తున్నారు. ఇంకా బ్రీతింగ్ లెవల్స్ పడిపోతే ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.
ఆరోగ్య పరిస్థితిపై సిబ్బంది ఆరా…
ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పర్యవేక్షణకు ఏఎన్ ఎమ్‌లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీ-ర్లు అందరూ పని చేస్తున్నారు. కరోనా బాధితుల బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటు-న్నారు. హోం క్వారం-టైన్ లో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా కరోనా కిట్ల పంపిణీ చేపట్టింది. ఈ క్విట్ల ద్వారానే కరోనా నయం చేసుకుంటు-న్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటు-ంది. 8 రకాల మాత్రలతోపాటు- మాస్కు లు, గ్లౌజ్‌లు, శాని-టైజర్‌ను ఇంటి వద్దకే వెళ్లి ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్‌లు అందజేస్తున్నారు… ఎంతవరకు ఉపయోగ పడుతున్నాయి… వాస్తవంగా ఆస్పత్రిలో ఉన్నప్ప టికీ ఇదే టాబ్లెట్స్ ఉంటాయని.. కాకపో తే అక్కడ డాక్టర్ల పర్యవేక్షణ ఉంటు-ంది. ఈ కిట్లు- ఎంత వరకు అందుతున్నాయి. అసలు వాస్తవంగా బాధితులకు చేరుతున్నాయా అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ అవసరం.
ఎపిలో కిట్స్ తో కరోనాకి చెక్……
Advertisement
తాజా వార్తలు
Advertisement