అమరావతి – ఆంధ్ర్రప్రదేశ్ లో కరోనా మరణ మృదంగం కొనసాగుతున్నది.. మరణాలు ఏ మాత్రం తగ్గడం లేదు.. ఆదివారం నాడు 52 మంది మరణించగా, సోమవారం నాడు ఏకంగా 64 మంది కన్నుమూశారు..ఇందులో విజయనగరం, అనంతపురం, తుర్పూగోదావరి, గుంటూరు, నెల్లూరు శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున , కర్నూలో 5, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7800కి చేరింది.. ఇక గడిచిన 24 గంటలలో కొత్తగా 11,434 మంది కరోనా బారినపడ్డారు…దీంతో ఇప్పటి వరకు 10,54, 875 మందికి కరోనా సోకింది. వారిలో ఇప్పటి వరకూ 9 లక్షల 44వేల 734 మంది కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 99వేల 446 యాక్టివ్ కేసులున్నాయి.. ఇక గడిచిన 24 గంటలలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2028 కేసులు నమోదు కాగా, చిత్తూరులో 1982,నెల్లూరులో 1237, శ్రీకాకుళం జిల్లాలో 1322 , అనంతపురం 702, తూర్పు గోదావరిలో 253, కడపలో 271, కృష్ణలో 544, కర్నూలులో 474, ప్రకాశంలో 497, విశాఖలో 633, పశ్చిమ గోదావరి జిల్లాలో 424 కేసులు వెలుగు చూశాయి..
ఎపిలో ఆగని మరణ మృదంగం – ఇప్పటి వరకు కరోనాతో 7800 మరణం..
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement