బంధుత్వం ఎక్కడ.. మానవత్వం ఏది
బాపట్ల టౌన్ – ఒక్కరై రావడం..ఒక్కడై పోవడం నడుమై ఈ నాటకం విధి లేరా…వెంట ఏ బంధము..రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ…అని ఓ రచయిత ఆ నలుగురు సినిమా లో రాసిన పాట ప్రస్తుతం అక్షరాల నిజమౌతుంది.
మనిషి బ్రతికి ఉన్నంత వరకు సంపాదించాలి.తన పిల్లలను ఉన్నత స్థాయి లో ఉంచాలి.సమాజంలో గౌరవంగా బతకాలి అని ఎంతో తపాత్రయంతో జీవిస్తాడు.ఎంత సంపాదించిన డబ్బుపై మనిషికి ఆశ చావదు.తాజాగా నేటి పరిస్థితులలో మనిషి ఎంత కోటీశ్వరుడైన ఎంత బంధుత్వం ఉన్న,పుత్రసంతానం ఉన్న, నేడు వస్తున్న వింత రోగాలకు మనిషి చనిపోతే కడసారి చూసే అవకాశం లేకుండా పోతుంది.సాధారణంగా మనిషి చనిపోయిన చూడటానికి బంధువులు కూడా దగ్గరకు రావడానికి భయపడుతున్నారు.కరోన వైరస్ తో చనిపోతే సొంత కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రావడానికి హడలెత్తిపోతున్నారు.కడసారి చూపుకు బంధుత్వం కూడా కంటికి కనిపించ కుండా పోతుంది. చికిత్స పొందుతూ వైద్యశాలలో మృతి చెందితే మానవత్వం కూడా చూపకుండ గంటల తరబడి శవాలను ఎక్కడ బడితే అక్కడే వదిలేసి సిబ్బంది వెళ్లిపోతున్నారు.తన తండ్రి, తన బంధువు చనిపోయారని తెలిసి కూడా చూడటానికి రాని బంధువులు,పుత్ర సంతానం ఉన్న ప్రస్తుత కాలంలో ఎంత కోటీశ్వరుడు అయిన అనాథ శవం లాగా చివరికి మిగిలిపోతున్నాడు.మంగళవారం బాపట్ల ఏరియా వైద్యశాలలో ఓ వ్యక్తి చనిపోవడంతో మృతుడి బంధువులు ఎవరు రాకపోవడంతో వైద్యశాల ప్రాంగణంలో స్టేచ్చర్ పై ఓ పక్కన శవాన్ని పెట్టారు.వైద్యశాలకు వచ్చే రోగులు ప్రస్తుత పరిస్థితుల్లో బయపడుతూనే,శవాన్ని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు.మృత దేహానికి అంత్యక్రియలు చేయడానికి కూడా బంధువులు రాని పరిస్థితిలో మున్సిపల్ అధికారులే మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు.
కరోనా విలయంలో ఒక్కరై రావడం..ఒక్కడై పోవడం
Advertisement
తాజా వార్తలు
Advertisement