Monday, November 25, 2024

ఈ పాపం ఎవ‌రిది….

అమరావతి, : కరోనాతో బాధపడుతున్న రోగికి మూడు గంటల్లోపు ఖచ్చితంగా బెడ్‌ ఇవ్వాలి. అత్యవసరమైతే ఆక్సిజన్‌ అందించాలి. ఇంకా ప్రమాదకర పరిస్థి తుల్లో ఉంటే ఐసీయూలో ఉంచాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంతటి వైద్యశాలపైనైనా కఠినచర్యలు తప్పవు.. ఇదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరచూ సమీక్షల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికా రులకు ఇస్తున్న సూచనలు. ఆ దిశగా ప్రైవేట్‌ వైద్యశాలల్లో ప్రభుత్వ నిబంధనలు అమలు కావాలని స్పష్ట మైన ఆదేశాలు ఇచ్చారు. అయితే రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్న మైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఆక్సిజన్‌ అందక వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ పాపం ఎవరిది.. విలువైన ప్రాణాలు పోతున్నా వైద్యులు ఎందుకు పట్టించుకోవడం లేదు. నోట్లకు, నోటి మాటకు ఉన్న విలువ కళ్ల ముందు ప్రాణాపాయ స్థి తిలో కొట్టుమిట్టాడుతున్న బాధితుల రోదనకు లేకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక వైద్యశాలల ఎదుట ఇటు వంటి సంఘటనలే దర్శమిస్తున్నాయి. పదు ల సంఖ్యలో ఆక్సిజన్‌ సకాలంలో అందక వైద్యశాలల ఎదుటే ప్రాణాలు వదిలేస్తు న్నారు. అదేవిధంగా బెడ్ల కోసం వందల సంఖ్యలో క్యూ లైన్ల లో వేచి ఉండి వారిలో 10 శాతం మంది నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో నమోదవుతున్న కోవిడ్‌ మరణాల్లో 50 శాతం సకాలంలో ఆక్సిజన్‌ అందక మృతి చెందుతుంటే మరో 20 శాతం మంది బెడ్ల కోసం వేచి ఉండి ఆరోగ్యం క్షీణించి చనిపోతున్నారు. మరో 30 శాతం మంది చికిత్స పొందుతూ వివిధ కారణాలతో ప్రాణాలు వదులుతున్నారు. అయితే బెడ్లు దొరకక చనిపోతున్న వారిలో ఎక్కువ మంది నిరుపేదలే. వీరి వద్ద ప్రైవేట్‌ వైద్యశాలలు అడిగినంత ఫీజులు చెల్లించు కునే ఆర్థిక స్తోమత లేకపోవడం, సిఫారసులు చేసి బెడ్‌ పొందే పరిచయాలు లేకపోవడం తదితర కారణాలు వెరసి అత్యధిక మంది పేదలే ప్రాణాలు కోల్పోతు న్నారు. వాస్తవానికి వీరి పట్ల వైద్యులు సకాలంలో స్పందిస్తే ఎన్నో విలువైన ప్రాణాలు నిలబడి ఉండేవి. తాజాగా మంగళవారం విశాఖలో కూడా ఓ చిన్నారి సకాలంలో ఆక్సిజన్‌ అందక ప్రాణాలొదిలింది. ఇటువంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కొకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. ఈ పాపం ఎవరిది అంటే.. కొన్ని కార్పొరేట్‌ వైద్యశాలలవేనని చెప్పక తప్పడం లేదు.
ప్రాణాలు పోతున్నా.. బెడ్‌ ఇవ్వరా
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలలో అదనపు బెడ్లను ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా ఆక్సిజన్‌ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ప్రైవేట్‌ వైద్యశా లల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కరోనా చికిత్స చేయాలని స్పష్ట మైన ఆదేశాలు జారీ చేసింది. అయినా కార్పొరేట్‌ వైద్యశాలలు మాత్రం తమ దోపిడీని ఆపడం లేదు. వైద్యశాలలో బెడ్లు ఖాళీగా ఉన్నప్పటికీ నో బెడ్స్‌ బోర్డు పెట్టి డబ్బున్నోళ్లకి మాత్రమే బెడ్లను కేటాయిస్తోంది. దీంతో అప్పటివరకు గంటల తరబడి బెడ్ల కోసం వేచి ఉన్న నిరుపేదలకు నిరాశే మిగులు తోంది. వారి కళ్ల ముందే కారులో వచ్చిన వారికి క్షణాల్లో అడ్మిషన్‌ ఇచ్చి బెడ్‌ చూపిస్తున్నారు. అందుకు కారణం వైద్యశాల యాజమాన్యం సూచించిన విధం గా అడ్మిషన్‌ కోసం 2 నుంచి 3 లక్షల వరకు వారి నుంచి తీసుకుంటున్నారు. అంత సొమ్ము బెడ్ల కోసం వేచి ఉండే నిరుపేదలు ఇవ్వలేని పరిస్థి తి. దీంతో డబ్బున్నో ళ్లకే వైద్యశాలల్లో బెడ్లు, మెరుగైన చికిత్సలు చేస్తున్నా రు. నిరుపేదలకు నిరీక్షణ తప్పడం లేదు. రాష్ట్రవ్యా ప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ తరహా దోపిడీ రోజురోజు కు పెరుగుతోంది. రానున్న వారం పదిరోజుల్లో కరోనా ఉదృతి పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టి లో ఉంచుకుని ప్రభుత్వం ప్రైవేట్‌ కోవిడ్‌ వైద్యశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బెడ్లు లభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement