Monday, November 18, 2024

నారా లోకేష్ – మంత్రి ఆదిమూల‌పు సురేష్ మ‌ధ్య ప‌రీక్ష‌ల ర‌ద్దు వార్…..

అమ‌రావ‌తి – ఎపిలో టెన్త్, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల ర‌ద్దు విష‌యంలో ప్ర‌భుత్వం, టిడిపి మ‌ధ్య తీవ్ర‌వాదోప‌వాదాలు కొన‌సాగుతున్నాయి… ప‌రీక్ష‌లు రద్దు చేయాల‌ని టిడిపి కోరుతుంటూ, ప‌రిస్థితిని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటామంటూ ప్ర‌భుత్వం స‌మాధానం చెబుతుంది.. ప‌రీక్ష‌ల ర‌ద్దు విష‌యంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కాస్త ఘాటుగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. అంతే ధీటుగా విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్పందిస్తున్నారు.. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాలంటూ నేడు నారా లోకేష్ మ‌రోసారి గ‌ళ‌మెత్తారు.. ప్ర‌భుత్వానికి 48 గంట‌ల డెడ్ లైన్ కూడా విధించారు.. ప్ర‌భుత్వ స‌రైన నిర్ణ‌యం తీసుకోకుంటే ప్ర‌త్య‌క్ష ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని కూడా ఆల్టిమేటం ఇచ్చారు.. అన్ని రాష్ట్రాల‌లో ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తుంటూ, ఎపిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నించారు.. విద్యార్దులు, టిచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రాణాల‌తో చెల‌గాటుమాడుతున్నారంటూ వైసిపి ప్ర‌భుత్వంపై మండి ప‌డ్డారు…లోకేష్ వ్యాఖ్య‌ల‌పై ఆదిమూల‌పు సురేష్ తీవ్రంగా మండి ప‌డ్డారు.. ఈ వ్యాఖ్యాలు విద్యార్ధి లోకాన్ని రెచ్చ‌గొట్టేవిగా ఉన్నాంటూ లోకేష్ పై ఫైర్ అయ్యారు..మంగ‌ళ‌గిరి: క‌రోనా నేప‌థ్యంలో అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి టెన్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని పేర్కొన్నారు. లోకేష్ వ్యాఖ్య‌లు విద్యార్థుల ఆత్మ‌స్థైర్యాన్ని త‌గ్గించే విధంగా ఉన్నాయ‌ని త‌ప్పుప‌ట్టారు. కొవిడ్ నియంత్రణ‌కు ప్ర‌భుత్వ చ‌ర్య‌లు క‌నిపించ‌డం లేదా అని లోకేష్ ను మంత్రి ప్ర‌శ్నించారు. వ‌కీల్‌సాబ్ మూవీ రిలీజ్ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వ‌కాల్తా పుచ్చుకున్న‌ప్పుడు లోకేష్‌కు క‌రోనా గుర్తు రాలేదా అని నిల‌దీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement