Tuesday, November 19, 2024

ట్రాఫిక్ కంట్రోల్ కోసం మెసేజ్ చేస్తే ప్రాబ్లమ్ క్లియర్ : గుంటూరు ఎస్పీ

డయల్ 100కి ధీటుగా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు కేటాయించిన నంబర్ కు మెసేజ్ చేస్తే, వెంటనే అక్కడికి ట్రాఫిక్ సిబ్బంది చేరుకుని అక్కడ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తారని గుంటూరు ఎస్పీ తెలిపారు. బుధవారం ఉదయం గుంటూరు జిల్లా స్పందన సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు. రోజురోజుకు గుంటూరులో ట్రాఫిక్ పెరిగిపోవడం వలన ట్రాఫిక్ కట్టడి కోసం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టామని, నూతనంగా నగర ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 8688831595 నంబర్ కు ప్రజలు ఫోన్ చేసి ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడవచ్చిని, డయల్ 100 నంబర్ కు ఫోన్ చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు ఏవిధంగా వచ్చేవారో, ఇప్పుడు ఈట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నంబర్ కు ఫోన్ చేసినా అంతేనని, గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ ఏఎస్పీ గంగాధర్, ట్రాఫిక్ డిఎస్పీ రమణకుమార్, వెస్ట్, ఈస్ట్ ట్రాఫిక్ సిఐలు, శేషగిరిరావు, నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement