అమరావతి – కేంద్రం విడుదల చేసిన నివాసయోగ్య నగరాల జాబితాలో ఏపీ నగరాల పరిస్థితి దిగజారడం పట్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. ట్విట్టర్ లో ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.. వివేకంలేని వైసీపీ పాలనలో ఏపీ నగరాల ప్రమాణాలు పడిపోయాయని అన్నారు. ఏపీ ఆధ్యాత్మిక రాజధానిగా ఎంతో ప్రతిష్ఠ కలిగివున్న తిరుపతి నగరం 4వ స్థానం నుంచి 46వ స్థానానికి పడిపోవడమే అందుకు నిదర్శనమని విమర్శించారు. నివాసయోగ్య నగరాల జాబితాలో విజయవాడ సైతం 9వ స్థానం నుంచి 41వ ర్యాంకుకు పతనమైందని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల దుస్థితిని తాజా ర్యాంకులు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement