అమరావతి – ఎపి సచివాలయంలోని ఉద్యోగులు కరోనాతో మృత్యువాత పడటం పట్ల టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు.. వారం రోజుల వ్యవథిలో ముగ్గురు మరణించడం, పదుల సంఖ్యలో ఉద్యోగులు కరోనా భారీన పడటం ముఖ్యమంత్రి జగన్ వైఫల్యమేనంటూ మండి పడ్డారు.. ఉద్యోగుల రక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్‌ను దాటడం లేదని ఆయన విమర్శించారు. ఉద్యోగుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. కరోనా విజృంభణకు ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళిక లోపమే కారణమని ఆయన చెప్పారు. ఉద్యోగులు మాత్రం విధులకు హాజరుకావాల్సిందేనని ఆయన చెబుతున్నారని తెలిపారు. వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు..
జగన్ అలసత్వం వల్లే ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోందని విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇవ్వండి… అశోక్ బాబు
సచివాలయంలో నలుగురు కరోనాతో మరణించడం బాధాకరరమని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.