Thursday, November 21, 2024

మొద్దు నిద్ర వీడండి – ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడండిః జ‌గ‌న్ కు చంద్ర‌బాబు విన‌తి…

అమ‌రావ‌తి – విజ‌య‌న‌గ‌రం మ‌హారాజ హాస్ప‌ట‌ల్లో విషాదం ప‌ట్ల టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. మృతి చెందిన వారి కుటుంబాల‌కు సంతాపం ప్ర‌క‌టించారు.. అలాగే బాధిత కుటుంబాల‌కు వెంట‌నే న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు…. నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో కరోనా అల్లకల్లోలం రేపుతుంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని… ఆక్సిజన్ కొరతను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందన్నారు. ఆక్సిజన్ బ్లాక్‌లో అమ్ముకుంటున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని… ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

అవి ప్ర‌భుత్వ హ‌త్య‌లే … నారా లోకేష్

విజ‌య‌న‌గ‌రంలో ఆక్సిజన్ కొర‌త‌తో ప‌లువురు రోగులు మ‌ర‌ణించ‌డం ప్ర‌భుత్వ హ‌త్య‌లే నంటూ టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో వ‌రుస‌గా ట్విట్లు చేశారు..ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే.. సీఎం జగన్ ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమ‌ర్శించారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి గారు పేరాసిట్మాల్, బ్లీచింగ్ కబుర్లు మాని ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని హిత‌వు ప‌లికారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement