తాడేపల్లి,ఫిబ్రవరి21(ప్రభ న్యూస్) ఎంటిఎంసి పరిధిలోని తాడేపల్లి
నులకపేట చైతన్య తపోవన్ రజతోత్సవంలో భాగంగా మంగళవారం ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సతిసమేతంగా
పాల్గొన్నారు. .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనిషి చేసిన పనులు బంధించేవి కాకుండా ఉండాలంటే భక్తి మార్గంలో నడవాలని అన్నారు.
భగవంతుడు అంగీకరించని పనులు చేయకూడదని అన్నారు. మనిషి కోపాన్ని తగ్గించుకోవాలని కోపం చేత ఎదుట మనషులను మార్చాలెమని మనిషిలో శాశ్వతమైన మార్పును తీసుకురాగలిగేది ప్రేమ ఒక్కటేనని అన్నారు.లోకంలో దోషం లేని వారు ఎవరు లేరని అన్నారు. ప్రేమ భాషంలో ముందుకు వెళ్లాలంటే ముందు భక్తి మార్గంలో ముందుకు వెళ్లాలన్నారు. మనసు రాగద్వేషము లేకుండా ఉంటే శాంతి ఉంటుందని అన్నారు.
అనంతరం జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు, మరియు విజయకీలాద్రి అర్చక బృందం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శేషమాలతో సత్కరించి, వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో
శ్రీమాతా శివానంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
భగవంతుడు అంగీకరించని పనులు చేయకూడదు…
Advertisement
తాజా వార్తలు
Advertisement