Saturday, November 23, 2024

కొప్ప‌ర్తిలో ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్…

అమరావతి: ఈఎంసీ–2 పథకం కింద వైయ‌స్సార్‌ కడప జిల్లా కొప్పర్తిలో వైయ‌స్సార్‌ ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ నిర్మాణానికి కేంద్రం తుది అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 540 ఎకరాల్లో మొత్తం రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రాంట్‌ రూపంలో రూ.350 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా లేఖ రాసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్క్రో అకౌంట్‌ ప్రారంభించి రాష్ట్ర వాటాను జమచేస్తే కేంద్రం మంజూరు చేసిన మొత్తాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తుంది. వైయ‌స్సార్‌ ఈఎంసీని అభివృద్ధి చేసిన తర్వాత ఎల్రక్టానిక్స్‌ తయారీ రంగానికి చెందిన కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేసేందుకు 347.40 ఎకరాలు విక్రయానికి లేదా లీజుకు అందుబాటులో ఉంటాయని, 92 ఎకరాల్లో రెడీ టు బిల్ట్‌ ఫ్యాక్టరీ షెడ్స్‌ నిర్మిస్తారని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో వివరించింది. వైయ‌స్సార్‌ ఈఎంసీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గత సంవత్సరం అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్‌ సమర్పించగా.. నాలుగు నెలల్లోనే తుది అనుమతులు రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement