Friday, November 22, 2024

ఏపీలో స‌భ‌లు, ర్యాలీల ర‌ద్దు.. ప్ర‌భుత్వం ఇచ్చిన‌ జీవోపై కోర్టుకు వెళతాం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఏపీలో వైసీపీ పాల‌న దారుణంగా ఉంద‌ని, ర్యాలీ, సభలు , సమావేశాలు నిర్వహించవద్దని ప్రభుత్వం చెప్పడం విడ్డురంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏపీలో అనుమ‌తులు లేకుండా ఎలాంటి ర్యాలీలు కానీ, స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌వ‌ద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ధర్నా, నిరసనలు చేయకుండా చేయడానికే జగన్ ఈ జీవో ఇచ్చారన్నారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ ర్వాలీ, సభలు నిర్వహించలేదా అని ప్రశ్నించారు. జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పుష్క‌రాల స‌మ‌యంలో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌కు, ఇప్పుడు జ‌రిగిన ఘ‌ట‌న‌కు లింకులు పెడుతూ ఇలాంటి జీవో తీసుకురావ‌డం విడ్డూర‌మ‌న్నారు. చంద్ర‌బాబు స‌భ‌లో ప్ర‌మాదం జ‌రిగింద‌ని స‌భ‌లు, ర్యాలీలు ర‌ద్దు చేశారు.. పుష్క‌రాల్లో ప్ర‌మాదం జ‌రిగింది క‌దా.. వాటిని కూడా ర‌ద్దు చేస్తారా అన్నారు. జగన్ మోహన్ రెడ్డిపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. దానిని తొలగించేందుకే ఈ పనికి మాలిన జీవో ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులపై ఆందోళనలు, నిరసనలు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోపై కోర్టుకు వెళ్లనున్నట్లు రామకృష్ణ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement