Tuesday, November 26, 2024

సి టి స్కాన్ కు రూ.మూడు వేలు….

అమరావతి, : రాష్ట్రం లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ ఆసుప త్రులలో సీ టీ స్కాన్‌కు రూ. ఐదు వేల నుంచి పది వేలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించింది. ఈ దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక జీవోను జారీ చేసింది. ప్రైవేట్‌ సీటీ స్కాన్‌ సెంటర్స్‌లో కోవిడ్‌ అనుమానితుల నుంచి రూ. మూడు వేలు మాత్రమే వసూలు చేయాలని ధరను నిర్దేశించింది. అంతకుమించి వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి ఆళ్ల నాని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీడియాకు వివరించారు. సీటీ స్కాన్‌కు రూ. మూడు వేలకు మించి వసూలు చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసు కుంటుందని హెచ్చరించారు. ఇంతకుమించి ఎక్కువ డిమాండ్‌ చేస్తే బాధితులు 1902కు ఫిర్యాదు చేయాలని సూచించారు. తక్షణమే ఈ ధరలు అమలులోకి వస్తా యని దీనిని ఉల్లంఘించిన స్కానింగ్‌ సెంటర్ల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చ రించారు. ప్రతి స్కానింగ్‌ సెంటర్లలో ప్రభుత్వం నిర్దేశించిన ధరను విధిగా బోర్డులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ కనిపించే విధంగా చూడాలని ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్ల ను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని నిర్దేశించారు. కోవిడ్‌ నిర్థారణ అయిన తర్వాత ప్రైవేట్‌ ఆసుపత్రులు విధిగా బాధితులకు పడకలు అందించాలని, లేని పక్షంలో
ప్రభుత్వం తీసుకున్న చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చ రించారు. కరోనా పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను ప్రతి సీటీ స్కాన్‌ సెంటర్లలో ఉండాలని ఈ సమాచారం మొత్తాన్ని ప్రభుత్వానికి అందించాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement