అమరావతి : కలెక్టర్లపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. ఏపీలో కలెక్టర్లు వర్సెస్ తహశీల్దార్లుగా పరిపాలన కొనసాగుతోందని, 2019 ఎన్నికల్లో రెవెన్యూ ఉద్యోగులు ఖర్చు పెట్టిన బిల్లులు చెల్లించకుండా కలెక్టర్లు ఇబ్బంది పెడుతున్నారన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెవెన్యూ ఉద్యోగులపై వత్తిడి ఉన్నా కష్టపడి పని చేస్తున్నారన్నారు. ఆర్ధిక ఒత్తిడులను రెవెన్యూ ఉద్యోగులు తట్టుకోలేరన్నారు. తహశీల్దార్లకు చెల్లించే వాహన ఖర్చుల్లో కూడా కోత విధిస్తున్నారని బొప్పిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బందికి చెల్లించాల్సిన డబ్బులతో కలెక్టర్లు బంగ్లాలు మరమ్మత్తులు చేయించుకుంటున్నారన్నారు. విద్యుత్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో తహసీల్దార్ కార్యాలయాలు పని చేస్తున్నాయని బొప్పరాజు పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement