Tuesday, November 26, 2024

ఎమ్మెల్యే శివ కుమార్ తో విగ్రహావిష్కరణలో భీం రావ్ యశ్వంత్ అంబేద్కర్..

తెనాలి, (ప్రభ న్యూస్):రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన మనుమడు భీం రావ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. మండలంలోని కోపల్లె లో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహావిష్కరణ కమిటీ కన్వీనర్ సమత ప్రపుల్ల కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సభలో యశ్వంత్ అంబేద్కర్ తో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. భారతజాతి గర్వించదగ్గ ప్రపంచ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాల లైబ్రరీలో అంబేద్కర్ రచనలు ఉన్నాయన్నారు. భావితరాల మనుగడని దృష్టిలోఉంచుకొని అనేక సంస్కరణలను రాజ్యాంగంలో పొందుపరిచిన మహనీయుడు ఆయన అని అన్నారు. ఆయన సూచించిన మార్గం నేటి యువతరానికి దిక్సూచి లాంటిదన్నారు.

ఆయన గొప్పతనం తెలియని కొంతమంది కుక్కమూతి పిందెలు ఆయనను కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేయడం సిగ్గుచేటన్నారు. దేశంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని ఆయన అన్నారు. తొలుత పట్టణంలోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సమాచార అధికారి పి రమేష్ కుమార్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు పుల్లారావు, ఓఎన్జీసి మాజీ ఈ డి డీఎం ఆర్ శేఖర్,ఆర్ అండ్ బి ఎలక్ట్రానిక్స్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పిల్లి హర్ష వర్ధనరావు, ఏపి సెబ్ ఎస్సీ/ఎస్టీ ఈ డబ్ల్యూఏ సెక్రటరీ జనరల్ ఏ వి కిరణ్,తెనాలి డి.ఎస్.పి మీ డాక్టర్ కె స్రవంతి రాయ్, తెనాలి ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాస రావు, తెనాలి మున్సిపల్ కౌన్సిలర్ గెడ్డే టి సురేంద్ర, కోపల్లె సర్పంచ్ చింతల కుమారి, ఎంపీటీసీ సభ్యుడు కారుమంచి కిషోర్, పెదరావూరు సర్పంచ్ కాకి రమాదేవి, ఎలక్ట్రికల్ ఎస్ ఈ తిలక్ కుమార్,నెల్లూరు ఎలక్ట్రికల్ సీ ఈ ఓ నాగరాజు ప్రభృతులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement