కరోనా ఓపిలోనే ప్రాణాలు కొల్పుతున్న బాధితులు…..
రెండురోజుల వ్యవధిలో 7గురు మృతి….
40రోజులుగా బీక్లాస్ గదిలో 100మంది… ఒక్కరినీ కూడా ఇంటికి పంపని వైనం….
సామాన్య రోగులు ఆస్పత్రికి వస్తే… కాటికి పోవాల్సిందేనా…
ఆస్పత్రి ఆధికారులు తీరుపై ప్రజలు మండిపాటు….
గుంటూరు మెడికల్ – గుంటూరు జిల్లా సాతులూరికి చెందిన ఆమెర్లపూడి దీన కుమారి ఐదురోజులక్రితం కరోనా పాజిటివ్ రాగా దగ్గరలో ఉన్న క్వారింటెన్ సెంటర్కు వెళ్లారు అక్కడ ఆరోగ్యం విషమించడముతో ఆదివారం రాత్రి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు 108వాహనంలో తీసుకువచ్చి వదిలి పెట్టారు అక్కడి అప్పటినుంచి ఆమెను పట్టించుకున్న నాధుడు లేరు. కనీసం ఊపిరి అడటం లేదన్నా గాని పట్టించుకోకుండా ఆమెకు బ్రతికుండగానే నరకం చూపించారు ఆస్పత్రి సిబ్బంది… చివరకు ఆమె బంధువులు మీడియాను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి రోజుకి ఇద్దరు చొప్పున గడిచిన మూడు రోజుల్లో కరోనా ఓ పి లోనే కనీసం అడ్మిషన్ కూడా తీసుకోకుండా ఏడుగురు మృత్యువాత పడ్డ అప్పటికే ఆస్పత్రి అధికారుల్లో చలనం రావడం లేదు. ఆస్పత్రిలో 2000 పడకలు అందుబాటులో ఉన్ననప్పటికీ తమన్న రోగులకు పడటం ఎందుకు కేటాయించడం లేదనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా నిలిచింది. వైపు రోజు 1200 వందల మందికి మాత్రమే చికిత్స అందిస్తున్నామని లెక్కలు చెప్తూన్న అధికారులు మిగతా 800 పడకల్లో ఎవరికి వైద్యం అందిస్తున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా నిలిచింది. ఆస్పత్రిలో ఏప్రిల్ ఆరో తారీకు నుంచి ఇప్పటి వరకు బి క్లాస్ వార్డులో విఐపి రోగులకు సేవలు అందిస్తూ అక్కడ వంద మంది రోగులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి పంపకుండా రాజకీయ నాయకుల సేవలో తేలియాడుతూ సామాన్య ప్రజల ప్రాణాలను గాల్లో కలుపుతున్నారు ఆస్పత్రి అధికారులు. కేవలం వారి స్వార్ధపూరిత వ్యవహార శైలి వల్ల రోజుకి పదుల సంఖ్యలో సామాన్య ప్రజలు మృత్యు వడిలోకి వెళుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఇంటికి పంపకుండా కొత్త రోగులు చేసుకోకుండా ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పాలని జిల్లా ప్రజానీకం ఆస్పత్రి అధికారుల తీరుపై మండిపడుతుంది. ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న పట్టకుండా చెలించకుండా కేవలం రాజకీయ నాయకులు జిల్లా ఉన్నత అధికారుల కు చెందిన కుటుంబాల వారికి మాత్రమే సేవలు అందిస్తున్నారు అంటూ ప్రజలు విమర్శలు చేస్తున్నారు.
ఆక్సిజన్ బెడ్ రూ 30నుంచి 40వేలు…. ఒకవైపు సామాన్య పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి మరోవైపు ఆస్పత్రిలోని కొంతమంది దళారులు కరోనా ఆక్సిజన్ బెడ్లు సైతం కాసుల కక్కుర్తి కోసం అమ్ముకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్తిలో పంచాయతీ సిబ్బంది కి ఎక్కడ ఏ వార్డులో ఖాళీ విషయం ముందే తెలుసుకుని కరోనా ఓపి వద్దకు వచ్చి కొంచెం డబ్బులు కలిగిన వారితో ఆడుతున్న సంఘటనలో రోజుకు ఒకటి చొప్పున పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రి అధికారులు కనీసం పర్యవేక్షణ చేయకుండా పోతే సామాన్య ప్రజల ప్రాణాలే అంటూ చోద్యం చూస్తూ ఉండటం పలు విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్రమైన దర్యాప్తు ఆదేశిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆస్పత్రి సిబ్బంది చర్చించుకుంటున్నారు
బెడ్లు ఖాళీ చేయరు… కొత్తవారిని చేర్చుకోరు….
Advertisement
తాజా వార్తలు
Advertisement