Tuesday, November 26, 2024

ప్రజలు అభివృద్ధికి సహకరించడం అభినందనీయం

బాపట్ల – పట్టణ అభివృద్ధి లో ప్రజలు తోడ్పాటు అందించడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ అన్నారు.శుక్రవారం పట్టణంలోని ఆంజనేయ స్వామి రహదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించారు.50 అడుగుల రహదారి నిర్మించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సర్వేయర్ శ్రీనివాసరావు, పురపాలక సిబ్బంది 50 అడుగుల రహదారి విస్తరణకు మార్కింగ్ చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ మాట్లాడుతూ అధికారులు ఎంత కృషి చేసినా అభివృద్ధి జరగాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని, పట్టణంలో పలు రోడ్ల విస్తరణ పనులకు ప్రజలు, వ్యాపారస్తులు,స్థలాల యజమానులు స్వచ్ఛందంగా సహకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ప్రజల అందరి సహాయ సహకారాలతో రోడ్ల విస్తరణ పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నామన్నారు.త్వరలోనే రహదారి విస్తరణ పనులు మొదలు పెట్టనుమ్మన్నారు. రానున్న రోజుల్లో పట్టణ రూపురేఖలు మారనున్నాయని,మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు.ఇప్పటికే ఉప సభాపతి కోన రఘుపతి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ రహదారి,తహశీల్దార్ కార్యాలయం రహదారి,రధం బజారు ను నూతనంగా విస్తరించినట్లు,అదేవిధంగా ఆంజనేయస్వామి రహదారిని కూడా సుందరవణంగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ మాల్యాద్రి,టిపిఓ శ్రీలక్ష్మి,తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement