అమరావతి: తన తండ్రి హత్య జరిగి రెండేళ్లు అయినా నిందితులను పట్టుకోకపోవడం దారుణం అంటూ వై ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ప్రశ్నించడంపై టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వైసిపి ఎంపి విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శించారు.. బాబాయి గొడ్డలితో గుండెలపై పొడుచుకున్నాడా? మీరే గొడ్డలి వేటేశారా? అని ట్విట్టర్ ద్వారా విజయసాయిని ఆయన ప్రశ్నించారు. ‘‘ఏ2 దొంగ రెడ్డీ! బాబాయ్ గొడ్డలితో గుండెపై పొడుచుకున్నాడా? మీరే గొడ్డలి వేటేశారా? ఓ చెల్లి తెలంగాణా రోడ్లపైనా, మరో చెల్లి ఢిల్లీలో.. అన్న కాదు అరాచకుడని నినదిస్తూ భయపెడుతున్నారా? పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలిచాం అంటూ కాలర్ ఎగరేస్తున్న ఏ1 వలలు, బారికేడ్లు, వెయ్యి మంది పోలీసులు కాపలాలో టీకా వేయించుకున్నాడంటేనే. జనాన్ని చూసి ఎలా వణుకుతున్నారో అర్ధం అవుతోంది. సీబీఐ వాళ్ళు వస్తున్నారట! హైదరాబాద్లో కొవిడ్ బెడ్లు రెడీ చేసుకో సాయిరెడ్డి!’’ అని అయ్యన్న ట్వీట్లో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement