Friday, November 22, 2024

అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు – మంత్రి ఆదిమూలపు

అమరావతి- అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు తెచ్చినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోటీ ప్రపంచంలో తట్టుకునేలా నైపుణ్యానికి పెద్దపీట వేస్తున్నామని, విద్యార్థుల్లో స్వయంప్రతిపత్తి కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో చేరేందుకు పరిధులు దాటి ఆన్‌లైన్‌ క్లాస్‌లు,ఆఫ్‌లైన్‌ క్లాస్‌లు క్రోడికరిస్తూ విధానంలో మార్పులు తెస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు జరగాలని అన్నారు. డిగ్రీ కోర్సులు కూడా పూర్తిగా పారదర్శకంగా, జవాబుదారితనంతో నిర్వహించాలి. అడ్మిషన్లు కూడా పారదర్శకంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు పాటించాలన్నారు. కొన్ని అటానమస్‌ కాలేజీల్లో అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకునే విధానం రద్దు చేసినట్ల తెలిపారు. ప్రతి డిగ్రీలో కూడా అప్రెంటిషిప్‌ విధానాన్ని తీసుకువస్తున్నామన్నారు.’అన్ని కాలేజీలకు జేఎన్‌టీయూ తయారు చేసిన ప్రశ్నాపత్రాలే ఉంటాయని, వాల్యూయేషన్‌ బాధ్యత జేఎన్‌టీయూకే అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 109 అటానమస్‌ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. జెఎన్‌టీయూ కాకినాడ పరిధిలో 31 కాలేజీలు ఉన్నాయని తెలిపారు. జెఎన్‌టీయూ అనంతపురం పరిధిలో 21 కాలేజీలు ఉన్నాయని చెప్పారు.  గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. పూర్తిగా కార్పొరేట్, ప్రైవేట్‌ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు ప్రభుత్వం పని చేసిందన్నారు. ప్రభుత్వ రాయితీలను వినియోగిస్తూ, రిజర్వేషన్లు పాటించకుండా, ఏకపక్షంగా అడ్మిషన్లు చేసుకున్నారని తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో ఆన్‌లైన్‌ పద్ధతిలో కూడా అడ్మిషన్లు చేపట్టామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement