అమరావతి, గ్రూప్- 1 ప్రొవిజినల్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 2018 డిసెంబర్‌లో నోటిఫికేషన విడుదల చేయగా.. 2020 డిసెంబర్‌లో పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలను కమిషన్ వెబ్‌సైట్ www.psc.ap.gov.in లో, కమిషన్ కార్యాలయ నోటీస్ బోర్డులో ఉంచినట్లు కార్యదర్శి పీఎస్సార్ ఆంజనే యులు వెల్లడించారు. కరోనా పాండమిక్ పరిస్థితుల నేపథ్యంలో ప్రొవిజినల్‌గా అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 14 నుంచి విజయవాడలోని కమిషన్ కార్యాల యంలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇంటర్వ్యూల పూర్తి షెడ్యూల్ ను త్వరలో విడుదల చేస్తామని, అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపిస్తామని స్పష్టం చేశా రు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు 48 గంటల్లోగా ఫామ్- 1 సర్టిఫికెట్లను శాప్ కార్యాలయ పరిశీలన కోసం పంపాలని సూచించారు.
డీఎల్ అర్హుల జాబితా విడుదల
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎకనమిక్స్ సబ్జెక్ట్ లెక్చరర్ పోస్టుల కోసం ప్రొవిజినల్‌గా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో, నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు.
శాఖాపరమైన పరీక్షలకు మరో అవకాశం..
కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా గతేడాది నవంబర్ సెషన్‌లో శాఖాపరమైన పరీక్షలకు హాజరు కాలేని అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. గతంలో ప్రకటించిన ప్రకారం ఈ నెల 29 నుంచి మే పదో తేదీ వరకు జరగాల్సి ఉన్న పరీక్షలకు, ఆన్‌లైన్‌లో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి చేయాల్సిన అవసరం లేదని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కూడా ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని, పరీక్షల తేదీలు త్వరలో ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు.
మిలటరీ కాలేజ్ అడ్మిషన్ టెస్టు దరఖాస్తు గడువు పెంపు
డెహ్రడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్(ఆర్‌ఐఎంసీ) అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. జూన్‌లో జరిగే పరీక్షా దరఖాస్తు గడువును మే 21 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి కల అభ్యర్థులు తమ దరఖాస్తులను విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో మే 21లోగా అందజేయాలని సూచించారు. జూన్ ఐదున జరగాల్సిన పరీక్ష, వాయిదా పడితే కొత్త షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్ ఫలితాలు విడుదల – జూన్ 14 నుంచి ఇంటర్వ్యూలు
Advertisement
తాజా వార్తలు
Advertisement