అమరావతి, : రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభు త్వం పటిష్టమైన చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోం ది. ఒక వైపు కరోనా కమాండ్ కంట్రోల్ రూం ని అందుబాటులోకి తీసుకురాగా, కరోనా నియంత్రణకు అయిదుగురు మంత్రులతో కూడిన కమిటిని నియమించింది… వైరస్‌ని నియంత్రించి బాధితులకు మెరు గైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో కరోనా తీవ్రత సెప్టెం బర్‌లో అత్యధికంగా ఉండటంతో ఆ సమయంలో బాధితుల కోసం 261 ఆస్పత్రులలో 37 వేల 441 పడ కలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు రెండో దశలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా వైద్య సేవలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కోవిడ్ అనుమతులు ప్రైవేట్ ఆసుపత్రులలో బాధితులకు ఉచిత వైద్యం అందించాలని ఆదేశించారు. ఆరోగ్య శ్రీ పరిధిలో కరోనా వైద్య సేవలు ఉన్నాయని వీటిని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కసరత్తును మళ్లి మొద లుపెట్టింది. నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ పెరు గుతున్న కేసుల సంఖ్యకు అనుగుణంగ వైద్య సేవలను విస్తరిస్తూ వస్తోంది. ముఖ్యంగా మర ణాల తీవ్రత అధికంగా తరుణంలో వీటిని నియంత్రించే దిశగా పకడ్భందీ చర్యలు చేప ట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కోవిడ్ కేర్ సెం టర్లతో పాటు జిల్లా ప్రధాన ఆసుపత్రులలో ఆక్సి జన్, మందుల కొరత ఏ మాత్రం లేకుండా చర్య లు తీసుకుంటోంది. రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో వైద్య సేవలు అందించే ఆస్పత్రుల సంఖ్యను మరోసారి గణనీయంగా పెంచింది. ఇప్పటివరకు 117 కోవిడ్ కేర్ సెంటర్లలో వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం వాటిని ప్రస్తుతం 155కు పెంచింది. అలాగే పడకల సామార్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచుతూ వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల 441 పడకలను కరోనా బాధితుల కోసం ప్రస్తుతానికి సిద్ధం చేసింది. వీటిలో 2 వేల 318 వెంటిలేటర్ సౌకర్యం ఉన్న పడ కలు ఉండగా.. 10 వేల 140 ఆక్సిజన్ బె డ్లను, 4 వేల 983 సాధారణ పడకలను రోగులకు అందుబాటు లోకి తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 155 ఆస్ప త్రుల్లో వైద్య సేవలను విస్తరించగా.. అనంతపురం జిల్లాలో ఎనిమిది, చిత్తూరులో 24, తూర్పు గోదావ రిలో మూడు, గుంటూరులో 43, కృష్ణాలో 15, కర్నూలులో 11, ప్రకాశంలో 15, నెల్లూరులో ఏడు, శ్రీకాకుళంలో మూడు, విశాఖలో ఆరు, విజయనగ రంలో ఎనిమిది, పశ్చిమ గోదావరిలో ఏడు, కడపలో 5 కోవిడ్ కేర్ సెంటర్లను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి జిల్లాలో ఆరు నుంచి పది ప్రైవేట్ ఆస్పత్రులు కోవిడ్ చికిత్సలకు అనుమతి లిచ్చింది. ఆయా ఆస్పత్రుల పడకల సామార్థ్యానికి అనుగుణంగా 25 నుంచి వంద పడకలు అందుబా టులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు బోధనా ఆస్పత్రులు సైతం కోవిడ్ సేవలను అందిస్తోంది.
విజయవాడ సన్‌రైజ్ ఆస్పత్రి అనుమతులు రద్దు..
రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల కరోనా దందా ను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరి స్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా ఇష్టానుసారం, ఫీజుల దోపిడీ, నాణ్యత లేని వైద్యం చేస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుం టోంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడ నగ రంలోని సన్‌రైజ్ ఆస్పత్రి కోవిడ్ చికిత్సల అనుమతు లను రద్దు చేసింది. ఆస్పత్రి యాజమాన్యం ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్ల ంఘించిందని స్పష్టం చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అనుమతులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ నెల 22వ తేది నుంచి మచిలీపట్నంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లాక్ డౌడ్ విధిస్తున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు..