అమరావతి – సివిల్ జడ్జి నియామక పరీక్షకు ఎటువంటి అనుభవం అవసరం లేదని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. సివిల్ జడ్జి నియామక నోటిఫికేషన్ పై 50కి పైగా వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో హైకోర్టు విచారణ నిర్వహించింది. సివిల్ జడ్జి పరీక్షలకు మూడేళ్ల న్యాయవాద అనుభవంతో పనిలేదని వివరించింది. అనుభవం అవసరంలేదని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ మేరకు సివిల్ జడ్జి పరీక్షలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. అంతేకాదు, ఇటీవల జరిపిన రాతపరీక్షలను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సవరణతో మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని రిక్రూట్ మెంట్ రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement