Friday, January 3, 2025

AP – అభివృద్ధి చేస్తుంటే ఓర్వ‌లేక‌పోతున్నారు …. వైసిపిపై విరుచుకుప‌డ్డ చంద్ర‌బాబు

అయిదు కోట్ల ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్నా.
ప‌ర‌దాలు లేవు, ఆటంకాలు లేవు..
నేరుగా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నా..
అయిదు కోట్ల ప్ర‌జ‌లే త‌న‌కు హైక‌మాండ్ అన్న ఎపి సిఎం

న‌ర‌సరావుపేట – కూటమి గెలిస్తే ఏమీ చేయలేరంటూ కొంతమంది అబద్ధపు ప్రచారాలు సాగించారని, ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంటే వారు ఓర్వలేకపోతున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమైనా చేయగలరని నిరూపించారన్నారు. తాను కష్టపడేది కేవలం ఐదు కోట్ల ప్రజల కోసమే నన్న చంద్రబాబు, సీఎం హోదాలో తాను సాదాసీదాగా వచ్చానన్నారు.

పల్నాడు జిల్లా యల్లమంద లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పనులు చేయించాలనేదే తన తపన అని పేర్కొన్నారు. తాను పర్యటనలకు వచ్చినా, పరదాలు కట్టలేదన్నారు. కాఫీ పెట్టడం పెద్ద కష్టం కాదని ఆడవాళ్లు ఉద్యోగం చేసి వస్తే భర్త కాఫీ పెడితే ఇద్దరూ తాగొచ్చు కదా అంటూ చంద్రబాబు అనగానే, సభలో నవ్వులు విరౠశాయి.

గత ఐదేళ్లు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంద‌ని పేర్కొన్నారు. కనీసం నవ్వలేని పరిస్థితి లో ప్ర‌జ‌లున్నార‌న్నారు.. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింద‌ని, మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వ‌చ్చిన తాము పించ‌ను పెంచి ఇప్పుడు ఇంటింటికీ వచ్చి అందిస్తున్నామ‌ని చెప్పారు.. ఇంటి వద్ద కాకుండా ఆఫీస్ లో పించ‌న్ అంద‌జేస్తే అధికారుల‌కు మెమో ఇస్తామ‌ని హెచ్చ‌రించారు.

- Advertisement -

పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని అంటూ . ఐదు కోట్ల మంది ప్రజల కోసమే తాను కష్టపడుతున్నాన‌ని ఉద్వేగంతో చెప్పారు.. తానకు అయిదు కోట్ల మంది ఎంపి ప్ర‌జ‌లే హైక‌మాండ్ అని అన్నారు.. ఏ ఇంట్లో కష్టమొచ్చినా వాళ్ల ఇంట్లో తానొక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్లను కాపాడుకుంటానని చెప్పారు. తాను ఏం చేసినా అందరికీ న్యాయం జరగాలనేదే త‌న ఆలోచన అని పేర్కొన్నారు…
పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మరిచిపోలేమని చంద్రబాబు అన్నారు. 90 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నార‌న్నారు. ప్ర‌తిఒక్క కార్య‌క‌ర్త‌కు తాము న్యాయం చేస్తామ‌ని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని.. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
అనంత‌రం చంద్ర‌బాబు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు బ‌య‌లుదేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement