అమరావతి: బడ్జెట్ ఆర్డినెన్సుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆన్ లైన్ లో జరిగిన క్యాబినేట్ మీటింగ్ లో బడ్జెట్ ఆర్డినెన్సును మంత్రులు ఆమోదం తెలిపారు. కాగా, మూడు నెలల కాలానికి ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రూపొందించింది. రూ.80వేల కోట్ల నుంచి రూ.90వేల కోట్ల వరకు మూడు నెలల బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, నవరత్న పథకాల అమలుకు ఈ నిధులు వినియోగిస్తారు. వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్‌ను రూపొందించడం విశేషం. ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం…
Advertisement
తాజా వార్తలు
Advertisement