Saturday, November 23, 2024

ఎపిలోని అన్ని కోర్టుల‌లో 50 శాతం సిబ్బందితో విధులు…

అమరావతి: ఎపిలోని వివిధ కోర్టుల‌లో సిబ్బంది కోవిడ్ భారీన పడుతుండ‌టం, కరోనా కేసులు పెరిగిపోతుండ‌టంతో రేప‌టి నుంచి అన్ని కోర్టుల‌లో 50 శాతం సిబ్బందితో విధులు నిర్వ‌హించనున్నారు.. ఈ మేర‌కు హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్ సర్క్యులర్‌ విడుదల చేశారు. సబార్డినేట్‌ కోర్టులు సహా ట్రిబ్యునల్‌, లేబర్‌ కోర్టులు, న్యాయసేవా సంస్ధలు, జిల్లా యూనిట్లలో 50 శాతం మంది మాత్రమే సిబ్బంది విధులకు హాజరుకావాలని మిగిలిన 50 శాతం మంది తరువాత రోజు విధులకు రావాలని హైకోర్టు పేర్కొంది. ఎవరైతే విధులకు హాజరు కారో వారు ఫోన్‌ కాల్‌లో అందుబాటులో ఉండి అవసరమైతే అత్యవసరంగా విధులకు హాజరుకావాలని కోరింది. న్యాయస్ధానాల ఉద్యోగులు ఎవరూ ముందస్తు అనుమతులు లేకుండా హెడ్‌ క్వార్టర్స్‌ను వదిలి వెళ్లకూడదని, హైకోర్టులోకి ప్రవేశించేముందు పూర్తిస్ధాయిలో శానిటైజేషన్‌ చేసుకొని, మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించి హాజరుకావాలని సూచించింది. ఈ ఆదేశాల శుక్ర‌వారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement