అమరావతి, ఆంధ్రప్రభ : రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఈనెల 7 నుంచి డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈనెల 7న గుంటూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం సందర్బంగా వ్యవసాయ యంత్రాల మేళ నిర్వహించనున్నారు. ఈ పథకం కింద తొలివిడతలో రైతులకు 3,800 ట్రాక్టర్లు, 300 కంబైన్డ్ హార్వెస్టర్స్ అందించను న్నారు. ఈనెల 7న తొలివిడతగా 1,215 ట్రాక్టర్లు, 77 కంబైన్డ్ హార్వెస్టర్స్ను అందించనున్నారు. పథకం ప్రారంభోవ్తం సందర్భంగా నిర్వహించనున్న మేళా ఏర్పాట్లను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఈ మేరకు ట్రాక్టర్ కంపెనీల ప్రతినిధులతో పాటు- తొలివిడతలో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందుకోనున్న పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్టా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని లబ్దిదారులయిన రైతులతో అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు-చేసి విదివిధానాలను వివరిస్తున్నారు. మేళా నిర్వహించే ప్రాంతానికి ట్రాక్టర్లను ముందుగానే తీసుకురావాలనీ, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.