అనుపాలెం (రాజుపాలెం): ఆత్మీయతకు,జీవన భరోసా కు చిరునామా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనని రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు అన్నారు. బుధవారం అనుపాలెం ( కుబడపురం) గ్రామంలో పింఛను పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంబటితో పాటు సర్పంచ్ సానికొమ్ము వెంకట సుబ్బమ్మ ఉన్నారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గ్రామంలో 644 మందికి పింఛన్లు ప్రతి నెల అందిస్తున్నామన్నారు ఇంత భారీ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వము పింఛన్లను ఒకటో తేదీన పెన్షన్ గా నేరుగా చేతికి అందించలేదన్నారు. వాలంటీర్ల సైన్యంతో ప్రతి గడపకు సూర్యోదయాన్నే పింఛన్ అందుతుందన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు సామాజిక పింఛన్ ఎంతో భరోసా కల్పిస్తుందన్నారు. ఒకటో తేదీన పింఛన్ చేతికందటంతో వారి మోముల్లో సంతోషం, ఆప్యాయత పట్ల చాలా సంతృప్తికరంగా ఉందని వివరించారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు సాని కొమ్ము శ్రీనివాసరెడ్డి ,జడ్పిటిసి సభ్యులు దొంతి రెడ్డి సునీత రెడ్డి, నాయకులు మర్రి సుబ్బారెడ్డి ,బాసు లింగారెడ్డి, తేలుకుట్ల చంద్రమౌళి, దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బండి కోటి నాగిరెడ్డి అన్నపురెడ్డి జగన్ మోహన్ రెడ్డి జెడ్, సి ఎస్ మండల ఇన్చార్జ్ పులిబండ్ల అశోక్, పలు గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.