Wednesday, November 20, 2024

అమరావతి భూములపై సుప్రీంలో విచారణ…

న్యూఢిల్లీ/ అమరావతి – అమరావతి భూములపై విచారణను సుప్రీంకోర్టు విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. సమయాభావం వల్ల వాయిదా వేసినట్లు జస్టిస్ అశోక్ భూషణ్ వెల్లడించారు. కాగా, కేబినెట్ సబ్‌కమిటీ, సిట్​‌పై హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై సుప్రీంలో నేడు విచార‌ణ జ‌రిగింది. కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు చేస్తామని ప్రతివాదుల అఫిడవిట్‌పై ప్రభుత్వం తరుపు న్యాయవాది అభిప్రాయాన్ని తెలిపారు. సీబీఐతో విచారణకు తమకు అభ్యంతరం లేదని రాజీవ్ ధావన్ స్పష్టం చేశారు. అయితే అంశాలన్నీ తదుపరి విచారణలోనే పరిశీలిస్తామని జస్టిస్ అశోక్ భూషణ్ వెల్లడించారు. న్యాయ‌వాది దమ్మాలపాటి పిటిషన్‌నూ అప్పుడే విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్యాప్తుపై విధించిన స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా తదుపరి విచారణ రోజు అభ్యర్థన పరిశీలిస్తామన్న ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement