అమరావతి – ఎపిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైయస్ జగన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతంపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతోందని, గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. 1930 ప్రభుత్వాస్పత్రులు, 634 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్ రోజుకి కనీసం 3లక్షలు పై బడి వేయాలని లక్ష్యం గా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించిందన్నారు. అత్యవసర వైద్యం కోసం 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలందరికీ అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఉన్నతాధికారులకు సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement