రాజుపాలెం – భక్తులు కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ ప్రసన్నంజనేయ స్వామి తిరునాళ్ల ఆకుల గణపవరంలో శనివారం నుండి 5 రోజులు పాటు జరగనున్నాయి. తొలి రోజైన శనివారం నాడు అష్టోత్తర ,శతనామార్చ పూజలు ,సామూహిక లక్ష తమలపాకుల పూజ ,సువర్చలా ఆంజనేయ కళ్యాణం ,స్వామివారి కోవెల విడిది కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటి సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయ పూజారులు పరాశరం రంగాచార్యులు ,యువకిశోరాచార్యులు మూలవిరాట్ ను బెంగుళూరు నుండి తీసుకువచ్చిన పుష్ఫలతో అలంకరించారు ,భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటి చలువ పందిళ్లు ,క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే దేవాలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. తిరునాళ్ల సందర్బంగా కోలాటాలు ,కేరళ నృత్యాలు ,పగటి వేషాలు ,పౌరాణిక నాటికలు ,సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు కమిటి సభ్యులు తెలిపారు ,27 నుండి 31 వరకు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా జాతీయస్థాయి ఎడ్ల పందేలు ఆరు విభాగాల్లో నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి కరతాళ భజన పోటిలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. , జైంట్ వీల్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, ట్రాంపోలైన్ లు ఆవరణలో ఏర్పాటు చేయడంతో తిరునాళ్ల సందడిగా జరగనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement