గుంటూరు – రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలు నిందివారందరికి వుచితంగా వాక్సిన్ వేయాలనే డిమాండ్ తో తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు శనివారం జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. దానిలో భాగంగా మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఆయన సతీమణి మాధవి లు గుంటూరు లోని కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ వాక్సినేషన్ ను సక్రమంగా వేయించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వున్న విపత్కర పరిస్థితులను దృష్టిలో వుంచుకొని 18 సంవత్సరాలు నిండిన వారందరికి ప్రభుత్వమే వుచితంగా వాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు సరైన వైద్య సౌకర్యాలు అందించటం, ఆక్సీజెన్ అందించటం, ఆసుపత్రులలో సరిపడా పడకలు కేటాయించటం లో ప్రభుత్వ వైఫల్యం కానవస్తోందన్నారు. కేంద్రప్రభుత్వం ఒక వైపు 50 శాతం వాక్సిన్ లు రాష్ట్రానికి వుచితంగా ఇస్తామని చెబుతుంటే, రాష్ట్రప్రభుత్వం కేవలం 13 లక్షల డోసులు మాత్రమే కొనుగోలు చేయగలమని చెప్పటం శోచనీయమని ఆయన పేర్కొన్నారు.