Tuesday, November 12, 2024

ప్రారంభమైన అఖండ సంగీతార్చన

గుంటూరు కల్చరల్, ఫిబ్రవరి 18(ప్రభన్యూస్) : మహాశివరాత్రి సందర్బంగా నిర్విరామంగా నిర్వహిస్తున్న 12వ అఖండ సంగీతార్చన భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. స్థానిక బ్రాడీపేట శ్రీభారతీ సంగీతానిలయం వ్యవస్థాపకులు వీణ గాన ప్రపూర్ణ ఎ. భారతీదేవి ఆధ్వర్యంలో లక్ష్మీపురంలోని శ్రీత్యాగరాజ సాంస్కృతిక సంఘం కళావేదికగా ప్రారంభమైన 12 వ అఖండ సంగీతార్చన శనివారం ఉదయం 6.00గంటల నుండి ఆదివారం ఉదయం 6.00 గంటల వరకు భక్తి శ్రద్ధలతో జరిగే నాదలోలుడికి సంగీతార్చన కార్యక్రమాన్ని రామరాజు ఫౌండషన్స్ అధ్యక్షుడు డాక్టర్ రామరాజు శ్రీనివాస్ , లక్ష్మి దంపతుల జ్యోతి ప్రద్వలన చేసి ప్రారంభించారు. నాదార్చనలో వీణ, వయోలిన్, కీబోర్డ్ , గాత్రంతో నాదార్చన కొనసాగుతోంది. కార్యక్రమంలో అనేకమంది స్థానిక , రాష్ట్ర, రాష్ట్రేతర కళాకారులు పాల్గొని ఉమామహేశ్వరులను సేవించుకుంటున్నారు. ప్రత్యేకంగా కుమారి సాయి లక్ష్మి, రామరాజు లక్ష్మీశ్రీనివాస్ ల వీణ, వల్లూరి కృష్ణకిశోర్ వేణువు, నాగలక్ష్మి గణపతి కృతులు ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమాలను కార్యదర్శి దుద్దుకూరి శ్యామసుందర్ పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement