Friday, November 22, 2024

హాస్టల్ విద్యార్థులతో వెట్టిచాకిరి : వార్డెన్ పై చ‌ర్య‌లు తీసుకోవాలి

తెనాలి : వెనుకబడిన కులంలో పుట్టి చదువుకునే స్థోమత లేక ఎందరో విద్యార్థులు కుటుంబ పోషణ కోసం చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులు ఎలాగోలా తమ పిల్లల్ని విద్యావంతులుగా చేయాలనే తాపత్రయంతో వారిని ప్రభుత్వం నడుపుతున్న బీసీ హాస్టల్ లో చేర్చి చదివిస్తున్నారు. అయితే హాస్టల్లో విద్యార్థులను సొంత బిడ్డలా చూడాల్సిన వార్డెన్ వారితో వెట్టి చాకిరి చేయిస్తూ.. వారి బాల్యాన్ని హరిస్తున్నారు. ఎర్రని ఎండలో కిలోమీటర్ల మేర బరువులు మోపిస్తూ వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. నగరంలోని బోస్ రోడ్ లో ఉన్న సరుకులను నాగర్ పేట లోని హాస్టల్ కు ఎర్రని ఎండలో ఉదయం 11 గంటల సమయంలో వారినెత్తిన బెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇది చూసిన ఆంధ్రప్రభ ప్రతినిధి ప్రశ్నించగా… నాకు తెలియదని హాస్టల్ వంటమనిషి చెప్పగా.. విద్యార్థులు ఇది మాకు మామూలేనని, ప్రతిసారి సరుకులు మేమే మోసుకొని వెళతామన్నారు. ఇంటి దగ్గర ఉంచి చదివించే స్తోమత లేక తమ పిల్లలను హాస్టల్లో ఉంచితే వారితో ఇంతపని చేయిస్తారా అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు అని చూడకుండా వారిని పని పిల్లలుగా మార్చిన సంబంధిత వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇకముందు ఇలాంటి పనులు పిల్లలకు చెప్పకుండా చూడాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement