అమరావతి: తనపై వచ్చిన అభియోగాలపై పూర్తి స్థాయిలో సిబిఐతో విచారణ జరిపించాలని ఐపిఎస్ అధికారి ఎ బి వెంకటేశ్వరరావు ఎపి ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ కు లేఖ రాశారు.. ఎక్వైరీ కమిషన్ విచారణలో ఉన్నతస్థాయి అధికారులే పలు లేఖలను పోర్జరీ చేశారని ఆయన ఆరోపించారు.. తన ఆరోపణలను రుజువు చేసే 9 పత్రాలను లేఖకు జోడించారు. డీజీపీ తన స్వహస్తాలతో ఫోర్జరీ చేసినట్టు ఆధారాలను లేఖకు జత చేశారు. డీజీ సవాంగ్, సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్, ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు, ఇంటెలిజెన్స్ అధికారులు, మరికొందరి ప్రమేయానికి సంబంధించిన పత్రాలు అందజేశారు. ఏబీవీ లేఖతో సచివాలయంలో కలకలం రేగింది. తనపై ఎంక్వయిరీస్ కమిషనర్ జరిపిన విచారణ సందర్భంగా దొంగ డాక్యుమెంట్లను సమర్పించారని గతంలోనే ఏబీవీ ఆరోపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement