ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని పర్చూరులో అర్ధరాత్రి ఓ ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు.. ఇంటి యాజమాని సుబ్బారావు, కనకదుర్గ దంపతులను కాళ్ళు చేతులను చీరతో కట్టి కత్తులతో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. బీరువాలోని 14 సవర్ల బంగారు నగలు, వెండి వస్తువులు, సెల్ ఫోన్స్, డాక్యు మెంట్స్, రూ.32 వేల నగదును అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement