తెనాలి : టీడీపీ సీనియర్ నేత దివంగత కింజరపు ఎర్రంన్నాయుడు 65వ జయంతిని బుధవారం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరి ప్రసాద్ మాట్లాడుతూ… ఎర్రంన్నాయుడు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, ఆయన లేకపోవడం పార్టీకి తీరని నష్టమేనన్నారు. పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కనక రాంబాబు మాట్లాడుతూ… ఎర్రంన్నాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే గా, నాలుగు సార్లు ఎంపీగా గెలిచారని గుర్తు చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో కీలక మంత్రి పదవి నిర్వహించి ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి వన్నె తెచ్చారన్నారు. అదే సమయంలో ముఖ్యంగా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడి వారిని పార్టీకి చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, ఈదర వెంకట పూర్ణ చంద్, గుమ్మడి ప్రసాద్, బిట్రా యుగంధర్, గిరి గణేష్, మంగమూరి హైమారావు, కౌన్సిలర్లు దివి అనిత, బోయపాటి అరుణ, బెల్లంకొండ శ్రీను, మునిపల్లె ప్రసాద్, గిరి, సుద్దపల్లి కిరణ్, కుదరవల్లి శ్రీను, లక్ష్మణ్, మల్లవరపు విజయ్, తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement