గుంటూరు మెడికల్ -బ్లాక్‌ఫంగస్ బారిన పడి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల లో చికిత్స పొందుతున్న బాధితులకు చికిత్స జటిలమవుతోంది. రోజురోజుకు ఆస్పత్రిలో కేసులు పెరుగుతున్నప్పటికి వారికి సరైన వైద్యం ఇచ్చేందుకు సరిపడా మందుల్లేక కొత్త సమస్యలువచ్చిపడుతున్నాయి. ఆస్పత్రి ఆధికారులు లెక్కల ప్రకారం సోమవారం ఉదయం నాటికి 60మంది పంగస్ బారిన పడి ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలోని 112 వ వార్డ్ ను ప్రత్యేకంగా బ్లాక్‌ఫంగస్ చికిత్స కోసం కేటాయించారు. అయితే బ్లాక్‌ఫంగస్ చికిత్సలో కీలకమైన లైపోజోమల్ ఆంఫోటెరిసిన్ బి.మందు అందుబాటులో లేకపోవడంతో చికిత్స అందించడంలో జాప్యం జరుగుతోంది. వాస్తవంగా పంగస్ సోకిన వారిలో 25శాతం మందికి ఆపరేషన్లు అవసరమవుతాయని మిగిలిన 75శాతం ప్రజలకు మందుల ద్వారా చికిత్స చేస్తారని ఈఎన్ టీ వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుంటూరు ప్రభుత్వ వైద్యశాల లో దీనికి భిన్నంగా జరుగుతుందని భాదితుల బంధువులు వాపోతున్నారు. మూడు రోజుల నుంచి కేవలం ఒకరిద్దరు వైద్యులు మాత్రమే రోగులను చూస్తున్నారని అత్యవసరమయితే నొప్పి తగ్గేందుకు చిన్న సూది మందుతో సరిపేడుతున్నారని అంతే తప్ప అందుబాటులో ఎవరు ఉండటం లేదని వారు వాపోతున్నారు. ఇది ఇలాగా ఉండగా భాదితులకు భోజనం అందించడంలోను తీవ్ర జాప్యం జరుగుతోందని ఆదివారం సాయంత్రం భోజనాలు వార్డ్ బయట పెట్టివేళ్ళారని కనీసం వార్డ్ బయట పెట్టిన విషయం కూడా సిబ్బంది కి గాని, రోగులకు గాని సమాచారం కూడా ఇవ్వకుండా వెళ్లారని వారు వాపోయారు అర్ధరాత్రి 11గంటల సమయంలో తమకు భోజనాలు అందాయని రోగులు తెలిపారు. ఆస్పత్రి ఆధికారులు ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బందువులు కోరుతున్నారు….
Advertisement
తాజా వార్తలు
Advertisement