అమరావతి – అధిక ఫీజలు వసూలు చేస్తూ నిబంధనలు పాటించని, ప్రమాణాలు అనుసరించని 259 ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేసింది ఎపి ప్రభుత్వం. ఈ మేరకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 259 ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలలకు 2019-20 విద్యా సంవత్సరంలోనే గుర్తింపు గడువు ముగిసిందని, వారు తమ గుర్తింపు రెన్యూవల్ చేసుకోలేదని తెలిపారు. అంతేకాకుండా పాఠశాలల్లో వసతుల కల్పనపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల గుర్తింపును ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల ఆన్‌లైన్ నామినల్ రోల్స్‌ను స్వీకరించబోమని సుబ్బారెడ్డి సదరు ప్రకటనలో స్పష్టం చేశారు. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన పాఠశాలల పూర్తి వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్ www.bse.ap.gov.in తెలుసుకోవచ్చని కోరారు. అలాగే బ్లాక్ లిస్ట్ లో పెట్టిన పాఠశాలలో తమ పిల్లలను చేర్చవద్దని సూచించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement