అమరావతి : రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగాల్సిన 20 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోని వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 125 పట్టణ స్థానిక సంస్థల్లో ఇటీవల 87 చోట్ల ఎన్నికలు జరగ్గా, వివిధ కారణాల వల్ల మిగిలిన 38 చోట్ల నిర్వహించలేదు. ఇప్పుడు వీటిల్లో పదవీకాలం పూర్తయి, న్యాయ వివాదాల్లాంటివి పరిష్కారమైన వాటికి త్వరలోనే ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా 20 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డులవారీ రిజర్వేషన్లను సూచిస్తూ పురపాలక శాఖ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వాటిని ఆమోదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో ఈ 20 మునిసిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది..
మున్సిపాలిటీల్లో వార్డులకు రిజర్వేషన్లు ఖరారు
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement