Monday, November 18, 2024

కొవిడ్ రోగుల కోసం 15వేల ప‌డ‌క‌లు సిద్ధం…

అమరావతి, : రాష్ట్రంలో కరోనా రెండో దశలో తీవ్రంగా విజృంభిస్తోన్న తరుణంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమ త్తమైంది. కరోనా బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పడకలను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 108 ప్రధాన ఆసుప త్రులలో 15 వేల 363 పడకలను ప్రస్తుతానికి సిద్ధం చేసింది. కరోనా తీవ్రంగా చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కోవిడ్‌ కేర్‌ సెంటర్లను అధికంగా ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లాలో 16 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 357 ఐసీయూ పడకలతో పాటు 1420 ఆక్సిజన్‌ పడకలను మరో 527 సాధారణ పడకలను సిద్ధం చేసింది. అలాగే కృష్ణా జిల్లాలో 14 కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. వీటిలో 230 ఐసీయూ, 589 ఆక్సీజన్‌, 440 సాధారణ పడకలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా లో 15 ఆసుపత్రులలో 123 ఐసీయూ, 828 ఆక్సీ జన్‌, 624 సాధారణ బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. కర్నూలులో 11 కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయగా.. 225 ఐసీయూ, 914 ఆక్సీజన్‌, 16 సాధారణ పడకలను ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. ఈ విధంగా కరోనా తీవ్రత ఆధారంగా ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తు న్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 15 వేల 363 పడకలు ఉం డగా.. వాటిలో కేవలం 3 వేల 200 మంది మా త్రమే వైద్య సహాయం పొందుతున్నారు. దాదా పు 12 వేల పైచిలుకు పడకలు ఖాళీగా ఉన్నాయి. కరోనా బాధితులు అత్యధికంగా హోం ఐసోలేష న్‌లో ఉంటున్నారు. దీంతో పడకలు చాలా వరకు అందుబాటులో ఉంటున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది. అత్యవసర కేసులు, కరోనాతో పాటు ఇతర సమస్యలతో ఇబ్బందులు ఎదు ర్కొంటున్న పేషెంట్లు చికిత్సకు ముందుకు వసు ్తన్నారని వైద్యులు చెబుతున్నారు.
ప్రైవేట్‌ ఆసుపత్రులలో
మరిన్ని పడకలు..
కరోనా విస్తరిస్తున్న సమయంలో ప్రభుత్వ దవాఖానాలో వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం.. ప్రైవేట్‌ వైద్య శాలలలో సైతం ఈ వైద్య సేవలను విస్తరిస్తోంది. ఇటు ప్రభుత్వ వైద్య శాలలో పడకల సంఖ్యను గణనీయంగా పెంచిన నేపథ్యంలో ప్రైవేట్‌ వైద్య శాలలలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో బెడ్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులిచ్చింది. ఆసుపత్రుల స్థాయికి అనుగుణంగా ఈ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో గతంలో గుర్తించిన ప్రైవేట్‌ ఆసుపత్రులలో వైద్య సేవలను కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వివాదాలను ఎదుర్కొంటున్న ఆసుపత్రుల పర్మిషన్స్‌ని రద్దు చేసింది. కోవిడ్‌ వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చిన ప్రభుత్వం దీని అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు తప్పని సరిగా పేదలకు ఈ పథకం పరిధిలో చికిత్స అందించాలని ఆదేశించింది. కనీసం పాతిక పడకలు ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రిలో సిద్ధంగా ఉండాలని ఈ పడకలలో కచ్ఛితంగా ఆరోగ్య శ్రీ సేవలు అందాలని నిర్దేశించింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆరోగ్య శ్రీ వర్తించని వారికి సైతం అందించే చికిత్సలు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement