అమరావతి – విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో జన సేనాని పవన్ కల్యాణ్ ఎందుకు పోరాటం చేయడం లేదని జగన్ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనల నేపథ్యంలో అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కొత్తగా చెప్పిందేమి లేదని తేల్చేశారు.. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా గతంలో చెప్పారు కదా? అంటూ వ్యాఖ్యానించారు..దీనిపై ఆయనే మళ్లీ పార్లమెంట్‌లో పోరాడాలని చెబుతారని పేర్కొన్నారు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో ఆయనే పోరాటం చేయవచ్చు కదా? . కేంద్రం మెడలు వంచవచ్చు కదా? అంటూ పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పునరుద్ధరించవచ్చు అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావటానికి సూచనలు చేశామన్నారు. అఖిల పక్షం, కార్మిక సంఘాలతో కలిసేందుకు అపాయింట్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారని తెలిపారు. ఈ విషయంలో ఎవరో వచ్చి మమ్మల్ని రాజీనామా చేయమని చెబుతున్నారని, . ఏ స్టెప్‌లో ఏం చేయాలో..ఎట్లా డీల్ చేయాలో తమ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు అవగాహన ఉందని అన్నారు. వృద్ధుడు చంద్రబాబు కంటే 1000 శాతం బెటర్‌గా మేం డీల్ చేస్తామని, . అందులో భాగంగానే సీఎం వైయస్ జగన్ అఖిలపక్షాలతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారన్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement